Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హరీష్ రావును అడ్డుకున్న 'ఆశా' కార్యకర్తలు!

ఈ ఉదయం మెదక్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ మంత్రి హరీష్ రావును ఆశా కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఆయన కాన్వాయ్ ముందుకు ఆశా కార్యకర్తలు తోసుకు రావడంతో పోలీసులు అడ్డు నిలబడి మంత్రికి రక్షణ కల్పించారు. అనంతరం కారు దిగిన హరీష్ రావు వారితో కాసేపు మాట్లాడారు. ఆశా కార్యకర్తల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. చైనా పర్యటన నుంచి సీఎం రాగానే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని హరీష్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం హరీష్ పర్యటన షెడ్యూల్ ప్రకారమే సాగిపోయింది.

More Telugu News